అక్టోబర్ ఒకటి నుంచి ప్రారభం కానున్న అన్ లాక్ 5.0కి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇవ్వాలా లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో సినిమాహాళ్లను తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 50% సిట్టింగ్ సామర్ధ్యంతో ఒక లైన్ తర్వాత మరో లైన్ పూర్తిగా ఖాళీగా ఉంచడం, లేదా సీటుకి సీటుకి మధ్య ఖాళీ వదలడం లాంటి కండిషన్లు పెట్టె అవకాశం ఉంది. దాదాపుగా ఆరు నెలల నుంచి దేశంలో ధియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే.. ఇక అటు స్కూల్స్, కాలీజీలకి ఇప్పట్లో అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. అటు పచ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ధియేటర్లకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. సీఎం తాజా నిర్ణయంతో ఆ రాష్ట్రములో అక్టోబర్ 01 నుంచి సినిమా ధియేటర్లు ఓపెన్ కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లకైనా కేవలం 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిబంధనలో వెల్లడించారు. ఈ నెల 30వ తేదిన అన్ లాక్ 4.0 కూడా ముగుస్తుంది.
previous post