telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ విషయం బోయపాటినే అడగండి : కేథరిన్

Catherine

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో ఒక కథానాయికగా నటించింది గ్లామర్ క్వీన్ కేథరిన్ ట్రెసా. అయితే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో కేథరిన్ కథానాయికగా ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ సినిమా నుంచి కేథరిన్‌ను తప్పించారని ఆ తర్వాత టాక్ బయటకు వచ్చింది. బోయపాటి సినిమా గురించి తాజాగా మీడియా ముందుకు వచ్చిన కేథరిన్ మాట్లాడింది. “బోయపాటి, బాలక‌ృష్ణ సినిమాలో నన్ను తీసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తీసేసారనీ రాశారు. ఆ సినిమా గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాలో నేను నటిస్తున్నానో, లేదో మీరు బోయపాటినే అడగండి” అని కేథరిన్ చెప్పింది. “ఇద్దరమ్మాయిలతో” సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కేథరిన్ ట్రెసా. ఆ తర్వాత పలు సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లు కూడా చేసింది.

Related posts