తెలుగులో ఒరిజినల్ డైరెక్టర్స్ అనిపించేవాళ్లే చాలా తక్కువమంది. ఎక్కడా కథలు, సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే ఫార్మాట్లు ఒకదానితో ఒకటి కలవకుండా, ఒరిజినాలిటీని కోరుకునే వారిలో లెక్కల మాస్టారుగా పేరుపడిన సుకుమార్ ఒకరు. ఆయన కెరీర్లో హిట్లుండొచ్చు.. ఫ్లాపులుండొచ్చు.. కానీ ప్రతి సినిమాలో ఒరిజినాలిటీ, కొత్తదనం కనిపిస్తాయి. ఆయన ఎవరినీ అనుకరించడు. అనుసరించడు. తన ఐడియాల్ని వేరే వాళ్ల సాయంతో డెవలప్ చేస్తాడు. లేదా వేరే వాళ్ల ఐడియాల్ని తాను డెవలప్ చేస్తాడు. అంతే తప్ప మరో భాషలో తీసిన సినిమాను సుకుమార్ రీమేక్ చేయడం అన్నది ఇంత వరకు జరగలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ హక్కులు కొన్న మలయాళ సినిమా ‘లూసీఫర్’ను సుకుమార్ రీమేక్ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ వార్త అబద్ధమట. ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయడానికి సుక్కు నో చెప్పారట.