telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య 106 సినిమా షూటింగ్ ప్రారంభం

Balakrishna

గ‌త ఏడాది డిసెంబర్‌లో “రూల‌ర్‌”గా సంద‌డి చేసిన బాల‌య్య ఈ ఏడాది బోయపాటి దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో బాలకృష్ణ అఘోరాగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య అసెంబ్లీలో బాల‌య్య గుండుతో క‌నిపించారు. ఆయ‌న‌ని చూసిన అభిమానులు బోయ‌పాటి సినిమా కోసం స‌రికొత్త లుక్ ట్రై చేస్తున్నాడని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. బాల‌కృష్ణ 106వ సినిమా కోసం ఇప్ప‌టికే బోయ‌పాటి రెండు సార్లు స్క్రిప్ట్ మార్చాడ‌ట‌. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు (సోమవారం) హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. యాక్ష‌న్ ఏపిసోడ్‌తో తొలి షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూడో చిత్ర‌మిది. అంజలి, శ్రియా శ‌ర‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ట‌. ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లో క‌నిపించబోతున్నారు. అది కూడా క‌వ‌ల‌లుగా. అందులో ఓ పాత్ర అఘోర పాత్ర అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. ఈ చిత్రాన్ని 2021 ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

Related posts