telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ “లక్ష్మీ” నుంచి కొత్త ప్రోమో

Laxmi Bomb

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఇటీవలే ఈ హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కనున్న సినిమాకు “లక్ష్మీ బాంబ్” అనే పేరును తొలగించి “లక్ష్మీ” అని పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రీమియర్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 9 నుంచి ప్రసారం కానుంది. దీంతో హీరో అక్షయ్‌ కుమార్‌, యూనిట్‌ సినిమా ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నారు. కాంచన చిత్రాన్ని లక్ష్మి పేరుతో హిందీలో తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అక్షయ్‌ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను అక్షయ్‌ కుమార్‌ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసిన అక్షయ్‌‌ “చూశారుగా ఈ విచిత్రమైన కుటుంబాన్ని మీరంతా ‌9న చూడండి” అంటూ ట్వీట్‌ చేశారు.’లక్ష్మి’ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలే ఉన్నాయి.

Related posts