telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నచ్చింది .. ప్రభాస్..

chiranjeevi-prabhas-and-ram-charan

ప్రభాస్ ‘సాహో’ మూవీ ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోల మధ్య పోటీ అనేది బయటి వ్యక్తులకు సంబంధించిన విషయం అని, హీరోల మధ్య ఎలాంటి పోటీ ఉండదని స్పష్టం చేశారు. బాలీవుడ్ కథానాయకులు తనను స్వాగతించిన తీరు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు. రణబీర్ కపూర్, అజయ్ దేవగణ్ వంటి హీరోలు సైతం ఆప్యాయంగా మాట్లాడడం తనను ఆకట్టుకుందని ప్రభాస్ పేర్కొన్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ అంతటివాడు ఫోన్ చేసి కొత్త సినిమా ప్రీమియర్స్ కు ఆహ్వానించాడని వెల్లడించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే తన అభిమతం అని, ఈ విషయాన్ని తాను చిరంజీవి, రజనీకాంత్, రాజమౌళి నుంచి నేర్చుకున్నానని ప్రభాస్ తెలిపారు. తనకంటే గొప్ప విజయాలు సాధించిన ఆ ముగ్గురు ఎంతో సింపుల్ గా ఉంటారని, అందుకే వాళ్ల బాటలోనే తాను కూడా నిరాడంబరంగా ఉండడం అలవర్చుకున్నానని ప్రభాస్ వివరించారు.

Related posts