telugu navyamedia
క్రీడలు వార్తలు

వ్యాక్సినేష‌న్‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం…

corona vaccine covid-19

మే 1వ తేదీ నుంచి 18 పైబ‌డిన అంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌నున్నారు.. అయితే ఈ ముడో దశ వ్యాక్సినేష‌న్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది కేంద్ర ప్ర‌భుత్వం… టీకా డ్రైవ్ మూడో దశను క్రమపద్ధతిలో అమలు చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ‌ మార్గదర్శకాలను విడుదల చేసింది.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శులు / ప్రధాన కార్యదర్శులు, యూటీలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.  వ‌చ్చే నెల ఇవ్వ‌నున్న వ్యాక్సినేష‌న్‌లో 18 ఏళ్ల‌ నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల పౌరులను టీకా ఇప్పించే జాబితాలో చేర్చడంతో అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్య పెరిగిపోగా.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు.. అర్హతగల పౌరులు టీకా సేవలను సజావుగా, సౌకర్యవంతంగా పొందగలిగేలా రాష్ట్రాలు, యూటీల ప్ర‌భుత్వాలు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి అని లేఖ‌లో తెలిపారు. లబ్ధిదారుల సంఖ్య‌ పెరిగే అవ‌కాశాలు ఉన్నందున.. వ్యాక్సినేష‌న్ కేంద్రాల వ‌ద్ద‌ రద్దీ ఎక్కువ ఉండ‌కుండా చూసుకోవాల‌ని, శాంతిభద్రతల స‌మ‌స్య త‌లెత్త‌కుండా త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని పేర్కొంది కేంద్రం. వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌తో సంబంధం లేకుండా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు కోవిన్ వ్యవస్థలో నమోదు చేసుకోవడం త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేసిన కేంద్రం.. అన్ని సీవీసీలు అన్ని టీకాలను రికార్డ్ చేయడం, డిజిటల్ టీకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం, అన్ని ఏఈఎఫ్ఐ లను నివేదించడం తప్పనిసరి అని.. ఇక‌, సీవీసీగా నమోదు చేసుకోవడానికి ఆరోగ్య కేంద్రాలు తగినంత కోల్డ్ చైన్ పరికరాలు, సామర్థ్యం క‌లిగి ఉండాల‌ని కేంద్రం తెలిపింది.

Related posts