telugu navyamedia
క్రీడలు వార్తలు

సంజుని కెప్టెన్ చేయడం జట్టులో ఎవరికీ ఇష్టం లేదు…

నిన్న ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే రాజస్థాన్‌ జట్టుపై డ్రహ్వగ్ మాట్లాడుతూ… శాంసన్‌ను సారథిగా చేయడం పట్ల రాజస్థాన్‌ జట్టు క్యాంపులో నిరూత్సాహం నెలకొందని వీరూ పేర్కొన్నాడు.’రాజస్థాన్‌ జట్టులో సంజూ శాంసన్‌ ఒకవైపు, మిగతా వారు మరొకవైపు ఉన్నారు. జట్టులో ఏమాత్రం సఖ్యత లేదు. శాంసన్‌ను కెప్టెన్‌ చేయడం ఆర్‌ఆర్‌ క్యాంప్‌లో చాలామందికి ఇష్టం లేదు. అప్పటివరకూ తమతో ఉన్నవాడు ఉన్నట్టుండి కెప్టెన్‌ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక బౌలర్‌ బౌలింగ్‌ వేస్తున్నప్పుడు అతనితో కలిసి చర్చించాలి. బౌలర్‌పై బ్యాట్స్‌మన్‌పై ఎదురుదాడికి దిగినప్పుడు కెప్టెన్‌గా బాధ్యత ఉంటుంది. బౌలర్‌ వద్దకు వెళ్లి అతన్ని కంఫర్ట్‌ జోన్‌లోకి తీసుకురావాలి. ఇదేమీ సామ్సన్‌ చేయడం లేదు’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథి రిషబ్​ పంత్‌లో ఈ తరహా విధానం చూశాను. ఇలా చేస్తే బౌలర్‌కు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పుడు బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశమూ దొరకుతుంది. రాజస్థాన్ డగౌట్‌లోని విదేశీ ఆటగాళ్లు కూడా సంజూ శాంసన్‌తో సరిగా కమ్యూనికేట్‌ కావడం లేదు. రాజస్థాన్ ఒక టీమ్‌గానే కనబడుటం లేదు’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Related posts