telugu navyamedia
సినిమా వార్తలు

పోలీస్ స్టేషన్‌లో సీమంతం..

మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. పోలీస్‌ స్టేషన్లో పెళ్లిళ్లను జరిపించే వార్తలు మనకి కొత్తేమీ కాదు. కానీ గురజాలలో ఏకంగా ఒక మహిళా కాన్‌స్టేబుల్‌కి, స్టేషన్లో సీమంతం జ‌రిపించారు.

వివరాల్లోకి వెళ్తే  గురజాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న బంగారమ్మ అనే మహిళకు ఈ అవకాశం లభించింది. బంగారమ్మ గురజాల పోలీస్ స్టేషన్‌లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తోంది. 

మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తోట బంగారమ్మ విధి నిర్వహణలో సమర్థురాలుగా తోటి సిబ్బంది మన్ననలు పొందింది.  ఈ నేపథ్యంలో తొలిసారి గర్భవతిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను తగురీతిగా సన్మానించాలని సిబ్బంది భావించారు.

నెల‌లు నిండిన ఆమెను స్టేష‌న్ కు పిలిపించిన  గుర‌జాల స‌ర్కిల్ పోలీస్ స్టేష‌న్ కు స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ గా ప‌నిచేస్తున్న సీఐ సురేంద్ర బాబు .. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఆమెకు ఓ సోద‌రుడిలా సీమంతం నిర్వఃహించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా స్టేష‌న్ లో ప‌నిచేస్తున్న తోటి పోలీసుల‌ కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఆహ్వానించి.. పుట్టింటి వారు ఏ మేర సీమంతం నిర్వహిస్తారో.. అచ్చూ అలాగే సురేంద్ర బాబు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

పళ్లు, గాజులు, కొత్తచీరలు అన్నింటినీ ఆ మహిళా కానిస్టేబుల్ కి బహుకరించి.. ఘనంగా సీమంతాన్ని జరిపించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల డీఎస్పీ మెహర్ జయరాం హాజరయ్యారు.

Constable Seemantham In Gurazala Police Station In Guntur District | Gurazala పోలీస్‌ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం

తనకు ఇంతటి గౌరవం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని, ఇంతటి సన్మానం నిర్వహించిన సిబ్బందికి రుణపడి ఉంటానని బంగారమ్మా అన్నారు. కాగా.. పోలీసులు డ్యూటీలోనే కఠినంగా ఉంటార‌ని, వ్యక్తిత్వంలో కాదని నిరూపించిన గురజాల సీఐ సురేంద్ర బాబు.. పోలీస్ సిబ్బందికి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు. .

Related posts