బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినికి అరుదైన గౌరవం దక్కింది. 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు శనివారం గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలువురు నటీ నటులు, కళాకారులు పురస్కారాలను అందుకున్నారు. వీరిలో హేమమాలిని కూడా ఉన్నారు.
సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ మెకుఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కూడా పాల్గొన్నారు. వేడుకలు గోవాలోని పనాజీలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
కాగా..ఈ చలన చిత్రోత్సవ వేడుకలో తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పాల్గొనడం విశేషం. సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అమెరికన్ ఫిల్మ్‌మేకర్ మార్టిన్ స్కార్సిసి, హంగేరియన్ దర్శకుడు ఇస్త్వాన్ జాబో అందుకున్నారు. నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు ఈ చలనచిత్రోత్సవ వేడుకలు జరగనున్నాయి.