telugu navyamedia
సినిమా వార్తలు

మూకుమ్మడిగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది.  మా ఎన్నికలు తెచ్చిన సంక్షోభం కొత్త కోణం తీసుకుంది. ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు?

రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్‌ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్‌ నుంచి గెలిచిన 11మందికలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం’ అని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

”మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారు. నరేష్ ప్రవర్తన సరిలేదు. సగం సగం కార్యవర్గం వలన ఉపయోగం లేదు. మా సంక్షేమం కోసం ఎంతో అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. మంచు విష్ణు ఎన్నో హామీలు ఇచ్చారు. సంక్షేమం విషయంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అందుకోసమే ఒక డీసెంట్ డెసిషన్ తీసుకున్నాం. మీకు అడ్డురాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం” అంటూ ప్రకాష్ రాజ్ చెప్పారు.

అప్పుడే రాజీనామా వెనక్కి తీసుకుంటా..

“నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు ఆ రాజీనామా ఆమోదించలేదు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ నాది ఒక కండిషన్ ఉంది. అది ఏమిటి అంటే.. నాన్ లోకల్ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి.. ‘తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అని మీరు మార్చకపోతే ‘మా’ సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు” అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 

Related posts