telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎడ్‌సెట్‌ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్‌ విశ్వేశ్వర్‌రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి పేర్కొంది

Related posts