telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలియానా “ది బిగ్‌ బుల్” ఫస్ట్ లుక్

Big-Bull

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌, నటి ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్‌ బచ్చన్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఇది ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాలోని ఇలియానా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఇలియానా కూడా ‘ది బిగ్‌ బుల్‌’ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్‌ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గన్‌, ఆనంద్‌ పండిట్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts