telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కిన్నెరసాని. రమణతేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మునుపటి సినిమాల కంటే కిన్నెరసానిలో కల్యాణ్‌ బాగా నటించాడని ప్రశంసలు అందుకున్నాడు.

ఇక సోలో ట్రిప్‌లు ఎంజాయ్‌ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు ఈ హీరో. అంతేకాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడు తన వర్కవుట్స్‌ వీడియోలను, ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటాడు.

తాజాగా కల్యాణ్‌ దేవ్‌ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. హ్యాపీ బర్త్‌డే మామ్‌, కొన్నిసార్లు జీవితం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ నీ ప్రేమతో ఆ కష్టాలను సైతం ఎదురీదగలనన్న నమ్మకం నాకుంది. ఎల్లప్పుడూ నావెంటే ఉన్నందుకు థ్యాంక్స్‌.. లవ్‌ యూ సో మచ్‌ మా.. అని రాసుకొచ్చాడు. దీనికి తల్లితో దిగిన ఫొటోలను షేర్‌ చేశాడు.

 

Related posts