telugu navyamedia
సినిమా వార్తలు

చెప్పు చెలీ!!

prema hrudayam poetry corner
పసిడి కాంతుల దొరసానీ!
అర నవ్వుల అలవేణీ!!
అపరంజి బొమ్మా!
ఓ ముద్దుగుమ్మా!!
వలపు వెన్నెల వన్నెల
వాన మాలికా! ప్రేమ మూలికా!
పైట అద్దంలో అందాలు
ఒలకబోయు నవమల్లికా! 
పున్నమి నాటి చల్లని చంద్రికా!
చెప్పవే! నీ మదిని దోచిన
నవ మన్మథుని సరదాలు
జామురాత్రి నిదురలోన
చేసిన చిలిపి సరసాలు
నీ హృదయ ప్రేమ తీగపై
పలికించిన ప్రేమ స్వరాలు
వలపుల వనంలో విశేషాలు
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts