telugu navyamedia
సినిమా వార్తలు

1500 కోట్ల 3డి “రామాయణం”లో నయనతార ?

nayanatara movie ira grand release

మ‌న సంస్కృతికి అద్దం ప‌ట్టే ఇతిహాసాల్లో రామాయ‌ణంకు ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే ఇప్పటికే రామాయణాన్ని వెండి తెరపై, బుల్లితెరపై ప్రదర్శించారు మన దర్శకనిర్మాతలు. తాజాగా “రామాయ‌ణం”ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా సిద్ధ‌మ‌య్యారు. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి, మామ్ ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్యావ‌ర్ ద‌ర్శ‌కులుగా మూడు పార్టులుగా రామాయణాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. 1500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని 3డీ టెక్నాల‌జీతో సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నుంది. ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాలు మాత్రం వెల్ల‌డికాలేదు.

ముఖ్యంగా రామడు, సీత,రావణాసురుడు పాత్రల్లో ఎవరు ఎంపికయ్యారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే దాదాపు మూడేళ్ల పాటు డేట్స్ కావాల్సి ఉంటుందని, కాబట్టి అలా కేటాయించేవాళ్ళకే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ నేపధ్యంలో సీతగా నటి నయనతారను అడిగారని, ఆమె పాజిటివ్ గా స్పందించారని సమాచారం. అయితే తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నటించడానికి కాల్‌షీట్స్‌ ఎలా సర్దుబాటు చేస్తుందనేదే చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్టుపై టీమ్ గత రెండేళ్లు గా పనిచేస్తోంది. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి “దంగల్” డైరెక్టర్ నితీష్ తివారి, “మామ్” మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానున్న ఈ చిత్రం లోని నటులు, సాంకేతిక వర్గానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Related posts