telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ సినిమా కోసం తమన్నాకు భారీ పారితోషికం

Tamannah

నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, చెల్లెలు నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ మూవీలో ఒరిజినల్ వర్షన్‌లో రాధికా ఆప్టే పోషించిన రోల్ నభా నటేష్ చేయనుందని, అలాగే పవర్‌ఫుల్ టబు రోల్‌లో తమన్నా కనిపించనుందని తెలిపారు. ‘అంధాదున్’ మూవీలో టబు పోషించిన పాత్ర సినిమా విజయంలో కీలకం అయింది. దీంతో ఈ రీమేక్‌లో కూడా ఆమెనే తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో ఆ రోల్ కోసం ఇలియానా, శ్రీయ, నయనతార, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు తమన్నాను సెలక్ట్ చేశారు మేకర్స్. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర కోసం తమన్నాకు ఏకంగా కోటిన్నర ముట్టజెప్తున్నారట నిర్మాతలు.

Related posts