telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ వెబ్ సైట్ కు సందీప్ కిషన్ కౌంటర్

Sandeep-Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన “నిను వీడను నీడను నేనే” హార్రర్ థ్రిల్లర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “నిను వీడని నేనే” శుక్రవారం విడుదల కాగా… పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. చాలాకాలం తరువాత తన సినిమా హిట్ కావడంతో ఎంజాయ్ చేస్తోన్న సందీప్ ను ఓ కామెంట్ బాధించింది. అందుకే వారికీ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. సినిమా పరాజయం పొందిందని ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తపై సందీప్ ఘాటుగా స్పందించాడు. ఈ సినిమా విదేశాల్లో సక్సెస్ కాలేదని, వసూళ్లు బాగాలేవని, విడుదలైన తొలి రోజున ప్రీమియర్స్ తో కలిపి కేవలం 5,939 డాలర్లు మాత్రమే వచ్చాయని, రెండో రోజు 7,513 డాలర్లు, మూడో రోజు 2,588 డాలర్లు వచ్చాయని పేర్కొంది. దీనిపై స్పందించిన సందీప్ “విదేశాల్లో భారీ వసూళ్లు రాబట్టలేకపోయిన మాట వాస్తవమే… తన సినిమా ఫ్లాప్‌ అని చెప్పుకోవడానికి సంకోచించబోను. కానీ ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీసు వద్ద హిట్‌… కాస్త సమాచారం సేకరించి వార్తలు రాయాలి. సినిమా విదేశీ వసూళ్లను విమర్శించినట్టుగానే, స్వదేశంలో విజయం సాధించిన విషయాన్ని మెచ్చుకోండి” అంటూ కౌంటరేశాడు.

Related posts