యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరిస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు.. రామ్ చరణ్, రాజమౌళి వచ్చారు. అయితే తాజాగా నవరాత్రుల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ ను ప్రసారం చెయ్యాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14న జెమినీ టీవీలో సమంత స్పెషల్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుందని తాజా సమాచారం.
దసరా కానుకగా రానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు. సామ్ గత కొన్ని రోజుల నుంచి విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోలో సమంత తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతుందేమో చూడాలి. ఇంకా విడాకుల ఎందుకు తీసుకున్నారు ? అనే విషయంపై కూడా క్లారిటీ ఇస్తే ఈ రూమర్లకు చెక్ పడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందో దసరా రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లోనే చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా త్వరలోనే ఈ షోలో కనిపించబోతుందట.