telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త గెటప్ లో నిఖిల్… ‘కార్తికేయ-2’ ఫస్ట్ లుక్

టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ-2‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. నిఖిల్ ‘కార్తికేయ 2’లో ‘రీతూ వర్మ’ నటించబోతుందట. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల అన్ని సినిమా షూటింగ్స్ తో పాటుగా ఈ సినిమా కూడా నిలిచిపోయింది. ఇది ఇలా ఉండగా నిఖిల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా “కార్తికేయ 2” నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నిఖిల్ గంభీరంగా కనిపిస్తున్నాడు. “సంక్షోభంలో రక్షకులు పుడతారు” అని పోస్టర్ పై రాసున్న లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Related posts