telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది… సీక్రెట్ బయటపెట్టిన నితిన్

Bheeshma

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా నితిన్, రష్మిక వాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఏమీ లేదని.. కాకపోతే ఈ ఏడాదిలో తన పెళ్లి కాబోతోందని అన్నారు. ‘‘పెళ్లి కుదిరాక ఫస్ట్ వాలంటైన్స్ డే కదా’’ అని రష్మిక అడగగానే.. ‘‘మీ అందరికీ తెలిసి ఇది ఫస్ట్ వాలంటైన్స్ డే, నాకు ఆ అమ్మాయి ఎప్పటి నుంచో తెలుసు. గత ఏడు ఎనిమిది ఏళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కాబట్టి ఎన్నో వాలంటైన్స్ డేలు గడిచాయి’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. తనది అరేంజ్‌డ్ మ్యారేజ్ కాదని లవ్ మ్యారేజ్ అని చెప్పారు. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘‘మీ ఇద్దరికీ మాత్రమే తెలిసి వేరేవాళ్లకు తెలియని ఒక సీక్రెట్ గురించి చెప్పండి’’ అని యాంకర్ నితిన్, రష్మికలను అడిగారు. ఈ ప్రశ్నకు కూడా రష్మిక చాలా సేపు ఆలోచించారు. అయితే, నితిన్ నేను చెప్తా అంటూ అందుకున్నారు. ‘‘సాధారణంగా సాయంత్రం ఆకలేస్తే మీరు ఏం తింటారు? ఉప్మా, ఇడ్లీ, స్వీట్, డిజర్ట్, చిప్స్ ఏవో ఒకటి తింటారు. ఈమె ఏం తింటుందో తెలుసా? కుక్క బిస్కెట్లు తింటుంది’’ అని టాప్ సీక్రెట్ చెప్పేశారు నితిన్. దీనికి రష్మిక వివరణ ఇచ్చుకున్నారు. తన దగ్గర ఒక పప్పీ ఉండేదని.. దానికి పెట్టే పెడిగ్రీ టేస్ట్ చేయాలనిపించి ఒకసారి తిని చూశానని అన్నారు. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూ అంతా చాలా సరదాగా సాగింది.

Related posts