telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శాకుంతలం’లో దుష్యంతుడి పై క్లారిటీ ఇచ్చిన టీమ్…

Shakuntalam

దర్శకుడు గుణశేఖర్ కు ‘శకుంతల’ దొరికేసింది. సమంత ఆ క్యారెక్టర్ ను చేయడానికి ఒప్పుకుంది. పూజ హెగ్డే అయితే ఎలా ఉంటుంది అంటూ చర్చలు కూడా జరిగాయి. కానీ గుణశేఖర్ మాత్రం హాట్ హీరోయిన్ సమంతని శకుంతలాగా దింపి షాకిచ్చాడు. కాగా గుణ శేఖర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. గుణశేఖర్ అంటే సెట్టింగులను పెట్టింది పేరు. ‘రుద్రమదేవి’ సినిమాతో ఓరుగల్లు చరిత్రను వెండితెరపై అద్బుతంగా రూపొందించాడు. ప్రస్తుతం పౌరాణిక సినిమా ‘శాకుంతలం’పై దృష్టి సారించారు గుణశేఖర్. ఇటీవ‌ల ఈ సినిమాలో శ‌కుంతల పాత్రను అక్కినేని స‌మంత చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దుష్యంతుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దింతో రోజుకొక వార్త దుష్యంతుడు అంటూ వినిపిస్తున్న తరుణంలో ‘శాకుంతలం’ టీమ్ రెస్పాండ్ అయ్యాడు. ‘శాకుంతలం’ సినిమాలో ఇతర పాత్రల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో ఎవరెవరి పేర్లనో దయచేసి ప్రచారంలోకి తీసుకురావొద్దని తెలిపింది. ఈ పాత్రల విషయంలో మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేవరకు అలాంటివి నమ్మొద్దని తెలిపింది. కాగా, దుష్యంతుడుగా రానాతో పాటు.. ప‌లువురు ప్ర‌ముఖ హీరోల పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో చిత్ర బృందం పుకార్ల‌ని కొట్టి పారేసింది. చూడాలి మరి ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది.

Related posts