telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ తో బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత పెళ్ళి…!

Aarav

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత, సినీటుడు ఆరవ్‌ నఫీజ్‌ హీరోయిన్‌ రేహిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. సెప్టెంబరు 6న చెన్నైలో వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించినట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగనుంది. ఆరవ్‌ నటించిన తొలి సినిమా ‘రాజా భీమా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. నరేశ్‌ సంపత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతుంది. కాగా గౌతం మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జోషువా ఇమాయి పోల్‌ కాకా’ అనే రొమాంటిక్‌ సినిమాలో హీరోయిన్‌గా రేహి నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Related posts