telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

రాశిఫలాలు : అంతా అనుకూలమే.. పట్టిందల్లా బంగారమే..

Today Rasi Phalalu

మేషం
మీపిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించినవ్యక్తికి చెప్పటానికి అనుకూలదినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీభావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృషభం
ఈ రోజు మీఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగాకొంత ఆందోళన, పరాకుగా ఉండటం జరుగుతుంది. చదువుపట్ల కొంతనిరాసక్తత ఉంటుంది. వాహనాలవిషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం
ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆర్థికంగాఅనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యవ్యాపారం కలిసి వస్తుంది. మీతల్లిగారి ఆరోగ్య విషయంలోజాగ్రత్త అవసరం.

కర్కాటకం
ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజుకాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

సింహం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలోపాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

కన్య
ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పనిచేయటానికి ముందుకురారు. కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో, దగ్గరి బంధువులతో వివాదం జరగటం లేదా వారుమిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినంకాదు. మీతల్లిగారి ఆరోగ్యం విషయంలోజాగ్రత్త అవసరం.

తుల
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోనిసాయం అందుకుంటారు. మీస్నేహం బలపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి. పెట్టుబడులులాభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

వృశ్చికం
ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికిఅనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులుకాని, ప్రశంసలు పొందుతారు. మీమిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

ధనుస్సు
ఈ రోజురోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటంకానీ, ఇల్లు సర్దటంకానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మకరం
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒకసంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థికనష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్నిఅదుపులో ఉంచుకోవటం మంచిది. శివుడిని పూజించండి.

కుంభం
ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం విషయంలో లేదా విద్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

మీనం
ఈ రోజు వివాదాలు, భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం. మీమాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థికలాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంతఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Related posts