telugu navyamedia
సినిమా వార్తలు

ఇందిరా గాంధీ వర్ధంతి… అప్పట్లో ఈ గాయకునిపై నిషేధం…!

indira-gandhi

దేశ ప్రథమ మహిళా ప్రధాని ఇందిరాగాంధీని 1984, అక్టోబరు 31న ఆమె అంగరక్షకులే కాల్చి చంపారు. ఈరోజు ఇందిరా గాంధీ వర్థంతి. 1971లో అమేథీ‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఇందిర ఎన్నిక చెల్లదని, దానిని సవాలు చేస్తూ ఆమె ప్రత్యర్థి అభ్యర్థి రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు నిచ్చిన కోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీనికితోడు ఇందిర మరో ఆరేళ్ల వరకూ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. అయితే ఇందిరాగాంధీ ఈ తీర్పుపై స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నేతల నుంచి వ్యతిరేకత చెలరేగకుండా ఆమె దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ సమయంలో పలు ఆందోళనలు జరిగాయి. అప్పటి ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తన గళం విప్పారు. దీంతో ఆయన పాటలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి ఇందిర ప్రభుత్వం తాము అమలు చేస్తున్న పథకాలకు గాయకుడు కిషోర్ కుమార్ చేత ప్రచారం చేయాలని భావించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఆయనను కలుసుకున్నారు. అయితే ఇందిర ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన కిషోర్ కుమార్ ప్రభుత్వ పథకాల ప్రచారానికి నిరాకరించారు. దీంతో అప్పటి ప్రభుత్వం కిషోర్ కుమార్ పాటలను రేడియో, దూరదర్శన్‌లలో ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. దీనిపై స్పందించిన కిషోర్‌కుమార్ తాను ఇతరుల ఇష్టానికో లేదా ఆదేశాల కోసమో పాటలు పాడనని స్పష్టం చేశారు.

Kishore-Kumar

Related posts