telugu navyamedia
సినిమా వార్తలు

30 థియేటర్లలో రీరిలీజ్ కు సిద్ధమైన “కేజిఎఫ్”

kgf

కన్నడ క్రేజీ స్టార్ యష్ నటించిన “కేజిఎఫ్” సినిమాను ఇటీవలే కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవంతమైంది. ఘ‌న‌ విజ‌యం సాధించిన ద‌క్షిణాది చిత్రం “కేజీయ‌ఫ్” క‌న్న‌డ స్టార్ హీరో యష్ ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. క‌న్న‌డ వ‌ర్షెన్‌లో కేజీఎఫ్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. క‌న్న‌డ రాజ్యోత్స‌వని పుర‌స్కరించుకొని కేజీఎఫ్‌1 చిత్రాన్ని న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగ‌ళూర్‌లో దాదాపు 30 థియేట‌ర్స్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, ఇందులో యశ్‌, సంజ‌య్ ద‌త్‌, ర‌వీన్ టాండ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో చిత్ర విడుద‌ల‌కి ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts