telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” మొదటివారం వసూళ్ళు

dear camrades movie first look

విజ‌య దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన “డియ‌ర్ కామ్రేడ్” చిత్రం ఇటీవలే విడుదలై విభిన్నమైన టాక్ ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో చాలా రోజుల తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు విజయ్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. అప్పుడే ఈ చిత్రం వచ్చి వారం రోజులు అయిపోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 34 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు సేఫ్ జోన్‌కు రావడం దాదాపు అసాధ్యం. వీకెండ్ వరకు కుమ్మేసిన ఈ చిత్రం తర్వాత చాలా డ్రాప్ అయిపోయింది. మూడు రోజుల్లోనే 18 కోట్లు షేర్ తీసుకొచ్చిన కామ్రేడ్.. ఆ తర్వాత నాలుగు రోజుల్లో కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసాడు. దీన్నిబట్టే సినిమా ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఏరియాలో కూడా ఈ చిత్రం సేఫ్ జోన్‌కు రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. నైజాంలో 6.5.. ఓవర్సీస్ 3.3.. మిగిలిన అన్ని భాషల్లో కలిపి 4 కోట్లు వసూలు చేసింది డియర్ కామ్రేడ్. ఇప్పటి వరకు 20.81 కోట్ల షేర్ తీసుకొచ్చాడు డియర్ కామ్రేడ్. మొత్తమ్మీద ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ పెట్టుకున్న నమ్మకం దారుణంగా వమ్ము అయిపోయింది. ప్రస్తుతం ఈ కుర్ర హీరో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Related posts