యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వద్ధామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం తాజాగా నాగశౌర్య కండలు పెంచి షాకింగ్ లుక్ లోకి మారాడు. ఆయన లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరో వైపు నాగ శౌర్య ప్రస్తుతం లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తున్న ఈ చిత్రం కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా… యంగ్ హీరోలు మంచి హిట్ కోసం ఎంతో పరితపిస్తుంటారు. సక్సెస్ సాధించాలనే కసితో ఎంత రిస్క్ అయిన చేసేందుకు వెనుకాడడం లేదు. ఇటీవల రామ్, బెల్లంకొండ శీను పాత్ర కోసం జిమ్‌లో గంటల కొద్ది గడుపుతూ, ట్రైనర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ సరికొత్త లుక్ లోకి మారారు. ఇప్పుడు నాగ శౌర్య కూడా కండలు తిరిగిన దేహంతో సరికొత్త లుక్ లోక్ మారారు.
previous post