రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆడమ్‌హారీ తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు అండగా నిలిచింది. చిన్న తనం నుండి తన శారీరక పరిస్థితిపై అయోమయ స్థితిలో కొనసాగిన ఆడమ్ హారీ తన పరిస్థితిని పక్కన పెట్టి గగన విహారాన్ని తన కెరీర్‌గా మార్చుకోవటంపై కలలు కన్నాడు. అయితే అతడి శారిరక పరిస్థితిని చీదరించుకున్న అతడి తల్లిదండ్రులు నిత్యం అతడిని కొడుతూ నాలుగ్గోడలకే పరిమితం చేశారు. మహిళ రూపంలో వున్న పురుషుడని అతడికి నచ్చచెప్పేందుకు అతడిని కౌన్సెలింగ్ సెంటర్లకు తీసుకెళ్లేవారు. ఈ అంతులేని చిత్రహింసలను భరించలేక అతడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తన కలను సాకారం చేసుకునేందుకు కృతనిశ్చయంతో అతడు వేసిన ముందడుగు అతడికి సహాయపడింది. తన శారీరక పరిస్థితి విషయంలో ఎదురైన చిత్రహింసలు, వేధింపులను దీటుగా ఎదిరించి రెండేళ్ల క్రితం ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌ను సాధించుకుని దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్‌గా రికార్డులకెక్కాడు.
ప్రస్తుతం 20 ఏళ్ల వయస్సులో వున్న హారీ కమ్మర్షియల్ పైలట్ కావాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కేరళ ప్రభుత్వం అతడికి రు.23 లక్షల మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తంతో ఇక్కడి ప్రసిద్ధ పైలట్ శిక్షణా సంస్థలో అతడు తన తదుపరి విద్యను కొనసాగించనున్నాడు. తన పోరాటాన్ని గుర్తించి తన కలను సాకారం చేసేందుకు సహకరించిన కేరళ ప్రభుత్వ సామాజిక న్యాయ విభాగానికి, ఆ విభాగం కార్యదర్శి బిజూ ప్రభాకర్‌కు హారీ కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇక్కడి రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ, ఆర్‌పిటి టెక్నాలజీ సంస్థల్లో మూడేళ్ల విద్యాభ్యాసాన్ని శిక్షణను పూర్తి చేసిన తరువాత తనకు కమ్మర్షియల్ పైలట్ లైసెన్స్ లభిస్తుందని హారీ చెప్పారు.
ఉత్తమ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్‌రెడ్డి