telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ కొత్త కారు.. వైరల్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త కారు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. కారు ఫీచర్స్‌ కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్‌ గ్రాఫిటే క్యాప్సుల్‌’ మోడ‌ల్ కారు ఇప్పుడు కేవ‌లం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న ఈ కారు త్వరలోనే హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతుంది. కాగా గతంలోనూ హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు.

కారు ప్రత్యేకతలు: అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఫుల్ ఆటోమేటేడ్ టెక్నాలజీతో కూడిన ఈ కారు విలువ రూ.3.16 కోట్లు. కారు పూర్తి బుల్లెట్ ఫ్రూఫ్ కాగా.. 200 కి.మీ. స్పీడులో వెళుతున్నా ఎలాంటి కుదుపులు ఉండవట. ప్రస్తుతం ఈ లగ్జరీ కారును ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఇదిలావుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు భారీ ట్యాక్స్ చెల్లించాల్సి రావడంతో సినీ తారలు ట్యాక్స్ మినహాయింపులు కోరుతున్న సంగతి తెలిసిందే. గతంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన విజయ్ దళపతి, ధనుష్ ట్యాక్స్ మినహాయింపు కోరగా కోర్టు వాటిని తిరస్కరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తీసుకున్న కారు సైతం విదేశాల నుంచి వచ్చినదే కాబట్టి తారక్ ఏంచేస్తారనేది చూడాలి. ఈ కారు విలువ కూడా భారీగానే ఉండటంతో ట్యాక్స్ కూడా బాగానే చెల్లించాల్సి ఉంటుంది.

Related posts