బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ ఇష్యూపై ఏకంగా నలుగురు హీరోల పేర్లు బయట పెట్టడం సంచలనంగా మారింది. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మొత్తానికి తెలుసని, కొకైన్ బానిసలు అని ముద్రపడిన ఆ నలుగురూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని కోరింది కంగనా. డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిపై ఉన్న రూమర్లకు చెక్ పెట్టాలని తాను కోరుతున్నానని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ని ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేయడం మరింత సెన్సేషన్‌గా మారింది. సో.. చూడాలి మరి కంగనా కామెంట్స్‌పై ఆ నలుగురు హీరోలు ఎలా స్పందిస్తారనేది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే గాక పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజం రాజ్యమేలుతోందని, అలాగే కొందరు బడా హీరోల బాగోతాలు బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆమె మరో సంచలనానికి దారి తీసింది. మరోవైపు సుశాంత్ సూసైడ్ కేసు విచారణలో భాగంగా ఆయన ప్రేయసి రియా చక్రవర్తికి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలున్నాయని తెలియడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయంటూ కంగనా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
I request Ranveer Singh, Ranbir Kapoor, Ayan Mukerji, Vicky Kaushik to give their blood samples for drug test, there are rumours that they are cocaine addicts, I want them to bust these rumours, these young men can inspire millions if they present clean samples @PMOIndia 🙏 https://t.co/L9A7AeVqFr
— Kangana Ranaut (@KanganaTeam) September 2, 2020
బిగ్ బాస్-3 : హిమజ డ్యాన్స్ పై పునర్నవి కామెంట్స్