telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దావూద్ తో బాలీవుడ్ దోస్తీ’ సమాధానమిచ్చిన సోనమ్ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సీఏఏ, జెఎన్‌యూ అంశాలను ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇటువంటి ఉదంతాలు విద్వేషాలను రెచ్చగొడతాయని అన్నారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక విలేకరి అనిల్ కపూర్ (సోనమ్ కపూర్ తండ్రి), దావూద్ ఇబ్రహీంలు కలసివున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ‘ మీరు ఇప్పుడు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు…. మరి మీ తండ్రికి, ఆ ఫోటోలోని వ్యక్తికి సంబంధం ఏమిటని’ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సోనమ్ కపూర్ ‘వారిద్దరికీ క్రికెట్‌తో సంబంధముంది. అనిల్ కపూర్, రాజ్ కపూర్, కృష్ణా కపూర్ మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. మీరు ఎవరి వైపున వేలు చూపించినా, మిగిలిన మూడు వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుంచుకోండి. శ్రీరాముడు మీ దృష్టిని మార్చాలని కోరుకుంటున్నానని’ సమధానం ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరోయిన్లు స్వరా భాస్కర్, తాప్సీపన్నుతో పాటు అనుభవ్ సిన్హా కూడా తమ గళం వినిపించారు.

Related posts