telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్‌’ ఫస్ట్ ఫస్ట్‌లుక్

pawan

2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో విజ‌యవంత‌మైన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మాత‌లుగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్..తిరిగి తెరంగేట్రం చేస్తోన్న ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇది పవన్ కళ్యాణ్ 26వ మూవీ. త్రివిక్రమ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ తరవాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఒక దశలో ఆయన తిరిగి సినిమాల్లో నటించరనే వార్తలు కూడా వచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అంతగా ప్రభావం చూపలేకపోయింది. రిజల్ట్స్ తర్వాత కూడా చాలా నెలలు సినిమాలకు దూరంగా ఉన్న పవన్..ఎట్టకేలకు ‘పింక్’ రీమేక్‌తో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. వరుసగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్‌కు పండుగ తెచ్చారు. తాజాగా రిలీజైన ‘పింక్’ లోని పవన్ లుక్ దుమ్మురేపుతోంది. పవన్‌ కల్యాణ్‌ లాయర్‌గా నటిస్తున్న పింక్‌ తెలుగు రీమేక్‌ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ అనే పేరును ఖరారు చేశారు. చుట్టూ పుస్తకాల మధ్య స్టైల్‌గా పడుకుని పుస్తకం చదువుతున్న పవన్‌ కల్యాణ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. వకీల్‌సాబ్‌ అనగానే నల్లకోటు వేసుకున్న లుక్‌‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా విడుదలైన లుక్‌లో పవన్‌ గుబురుగడ్డంతో, కూలింగ్‌ గ్లాస్‌తో స్టైల్‌గా కనిపిస్తున్నారు.

Related posts