telugu navyamedia
సినిమా వార్తలు

“వాల్మీకి”లో తెలుగమ్మాయి ఐటమ్ సాంగ్

Dimple-Hayathi

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్, టీజ‌ర్స్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైనర్‌ని అందిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. క్రూరమైన లుక్‌తో, గుబురు గడ్డం.. మాసిన జుట్టుతో కళ్లకు కాటుక పెట్టుకుని, ముఖంపై గాట్లుతో క‌రుడు గ‌ట్టిన వ్య‌క్తిలా వ‌రుణ్ అద‌రగొడుతున్నాడు . మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది. వాల్మీకి చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించిన “జిగర్తాండ” చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది.

Related posts