telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళల కొంగుకు పెట్టే పిన్నుసు గురించి తెలుసా?

 

పిన్నీసు కథ…*

ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి…

 

*ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో,*

 

*ముప్పైఏళ్ళ క్రితం మొలతాడులకూ,

ఆడవారి పసుపుతాడులకూ వేలాడే సూదిపిన్నీసులు అంతే!!!.*

 

ఆ రోజుల్లో *హవాయి చెప్పు తెగిపోతే కాపాడేది పిన్నీసే.*

*మూడు నాలుగు సంవత్సరాలకోసారి కుట్టించే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే* కాపాడింది ఆ పిన్నీసే.

*ఆ రోజుల్లో*—

 ఎప్పుడుపడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు,

*సంవత్సరానికోసారి, అదైనా పండక్కే.*

*కాల్లో ముల్లుగుచ్చుకుంటే పిన్నీసే,*

*చెవిలో గులిమి(గుబిలి) తీసుకోవాలంటే పిన్నీసే,*

*పంట్లో ఏదైనా ఇరుక్కున్నా పిన్నీసే,*

*చిన్నప్పుడు పెన్ను పాళీ సరిగ్గా రాయకపొతే పాళీని తీసేసి దానికున్న గాడిలోంచి గడ్డకట్టిన ఇంకును పిన్నీసుతోటే శుభ్రం చేసేవాళ్ళం,*

బాల్ పెన్నులో వుండే బాల్ సరిగ్గా తిరగకపోయినా *ఆ పిన్నీసుతోటే రిపేరు చేసేవాళ్ళం.*

జెండా వందనం రోజున *పిల్లల జేబులకి జెండా బొమ్మని పిన్నీసుతోనే* పెట్టుకున్న గుర్తు.

అటువంటి పిన్నీసుకు *కాలం చెల్లింది అనుకునే టైంలో*

ఇవాళ ఒకబ్బాయి “అంకుల్, పిన్నీసుంటే ఓసారివ్వరా?

*సెల్లో సిమ్ము తీసుకోవాలి”*

 అన్నప్పుడు,

*నాకు చాలా గర్వంగా అనిపించింది.*

*మన చిన్నప్పటి పిన్నీసుకు మళ్ళీ మంచిరోజులు వచ్చాయా* అని?

 

 

Related posts