telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భువి దేవి!

bhuvi devi poetry corner
భూలోక సుందరీ!
నా ప్రేమ పందిరీ!!
వెన్నెల వానల్లో
వెలిగిపోతావు
వలపు ముత్యమై
నా గుండెల్లో ఒదిగిపోతావు
మంచు పువ్వుల్లా
నా ప్రేమ ఒడిలో వాలిపోతావు
నిండుజాబిలి వెండి వెన్నెలై చలువనిస్తావు
ప్రకృతి బడిలోన
ప్రేమ పాఠాలు నేర్పుతావు
కోమలి కరాలతో పూలు కోసి
ప్రేమ మాలగా చేసి 
నా మెడలో వేసి మురుస్తావు
అడవి అందాలకు ఫోజునిచ్చి
గట్టిపోటీనిస్తావు
భువి దేవి కన్యగా
దివి దేవ కన్యలకు
ఈర్ష్య కల్గిస్తావు
సొగసుల సోకులతో..
వలపుల హొయలుతో..
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts