telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్ ను టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు… కన్నీటి పర్యంతమైన బాబా భాస్కర్

Bigg-Boss-3

బిగ్ బాస్-3 తెలుగు రియాలిటీ షో నుంచి గ‌త వారం రోహిణి ఎలిమినేట్ కాగా… ప్రస్తుతం ఐదో వారం షో కొనసాగుతోంది. ఇప్పుడు హౌజ్ లో 12 మంది స‌భ్యులు ఉన్నారు. సోమవారం నామినేష‌న్ ప్ర‌క్రియ జరగగా… అలీ కెప్టెన్ కావ‌డంతో ఆయ‌నకి న‌లుగురిని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చారు. అలీని బుజ్జ‌గించి, లాలించి, న‌చ్చ జెప్పి ఆయ‌న మ‌న‌సు మార్చిన వారు ఎవ‌రైతే ఉంటారో వారు సేఫ్ అవుతారు, ఒక్క‌రు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌లో అలీ.. బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లను సూచించారు. దీంతో బాబా బాస్క‌ర్ .. అలీ మ‌న‌సు గెలుచుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. గేమ్‌లో సీరియ‌స్‌గా ఉండక‌పోవ‌డం వ‌ల‌ననే మిమ్మ‌ల్ని నామినేట్ చేసాన‌ని అలీ చెప్ప‌డంతో బాబా సీరియ‌స్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక హిమ‌జ కూడా అలీ మ‌న‌సు మార్చే ప్ర‌య‌త్నం చేసింది. కొద్ది సేప‌టి త‌ర్వాత కోర్టు యార్డ్‌లో కూర్చున్న ఇంటి స‌భ్యుల‌కి సంబంధించిన నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు బిగ్ బాస్. టేబుల్‌పై ఉంచిన బాక్స్‌ల‌ని ఒక్కొక్క‌రు ఎంపిక చేసుకోవాల‌ని, అందులో బ్లాక్ కల‌ర్ బాల్ వ‌స్తే నామినేట్ చేయాల‌నుకుంటున్న ఇద్ద‌రికి రంగు పూసి వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నామో వివ‌రించాల‌ని అన్నారు.

రెడ్ క‌ల‌ర్ బాల్ వ‌స్తే ఆ స‌భ్యులు క‌న్ఫెష‌న్ రూంకి వెళ్లి నామినేట్ చేయాల‌నుకున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఎవ‌రో తెల‌పాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. మొదటిగా రంగంలోకి దిగిన పునర్నవికి బ్లాక్ బాల్ రావ‌డంతో తాను… హిమజ, రాహుల్‌కి రంగు పూసి నామినేట్ చేసింది. ఇక బాబాకి బ్లాక్ క‌ల‌ర్ బాల్ రాగా ఆయ‌న… రాహుల్, అషుకి రంగు పూసి నామినేట్ చేశాడు. ర‌వికి కూడా బ్లాక్ బాల్ రావ‌డంతో… రాహుల్, హిమజకి క‌ల‌ర్ పూసి నామినేట్ చేశాడు. వితికా షెరుకి రెడ్ క‌ల‌ర్ బాల్ రావ‌డంతో క‌న్ఫెష‌న్ రూంకి వెళ్ళి.. మహేష్ విట్టా, అషుల‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు తెలిపింది. బ్లాక్ క‌ల‌ర్ బాల్ రావ‌ల‌నుకున్న శ్రీముఖికి రెడ్ క‌ల‌ర్ రావ‌డంతో క‌న్ఫెష‌న్ రూంకి వెళ్ళి… రాహుల్ సిప్లిగంజ్, అషుల‌ని నామినేట్ చేసింది. ఇక రాహుల్‌కి కూడా రెడ్ క‌ల‌ర్ బాల్ రావ‌డంతో క‌న్ఫెష‌న్ రూంకి వెళ్లి… హిమజ, శ్రీముఖిల‌ని నామినేట్ చేశాడు. అషుకి బ్లాక్ క‌ల‌ర్ బాల్ రావ‌డంతో… హిమజ, రాహుల్ కి రంగు పూసి నామినేట్ చేసింది. వరుణ్ కి బ్లాక్ క‌ల‌ర్ బాల్ రాగా.. రాహుల్, మహేష్ విట్టాలకి రంగు పూసి నామినేట్ చేశాడు. శివజ్యోతికి రెడ్ బాల్ రాగా ఆమె కన్ఫెష‌న్ రూంకి వెళ్ళి… పునర్నవి, రాహుల్‌ని నామినేట్ చేసింది.

మహేష్ విట్టాకి బ్లాక్ క‌ల‌ర్ బాల్ రావ‌డంతో… రాహుల్, వరుణ్ సందేశ్ కి రంగు పూసి నామినేట్ చేశాడు. ఇక హిమజకి బ్లాక్ క‌ల‌ర్ బాల్ రావ‌డంతో… పునర్నవి, అషుల‌కి రంగు పూసి నామినేట్ చేసింది. ఇక అలీ కెప్టెన్ కాగా, ఆయ‌న చెప్పిన న‌లుగురిలో నామినేట్ కాని ఓ వ్య‌క్తిని ఎన్నుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో అలీ.. బాబా భాస్కర్‌‌ను నామినేట్ చేశారు. అయితే గ‌త వారం చేసిన చిన్న పొర‌పాటు వ‌ల‌న శివ‌జ్యోతి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ఐదో వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం రాహుల్ 8 మందితో నామినేట్ కావ‌డం విశేషం.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా హిమ‌జ‌, పున‌ర్న‌వి, అషూల మ‌ధ్య చిన్న‌పాటి వాద‌న‌లు జ‌రిగాయి. ఇక హౌజ్‌లో అంద‌రికన్నా ఎక్కువ స‌ర‌దాగా ఉండే బాబా భాస్క‌ర్ త‌న బాధ‌ని శ్రీముఖికి చెప్పుకొని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. అలీ త‌న‌ని నామినేష‌న్‌లో సీరియ‌స్‌గా ఉండ‌మ‌ని చెప్ప‌గా, అలాగే ఉన్నాను. అయిన‌ప్ప‌టికి న‌న్ను నామినేట్ చేయడం ఏంటి అని చెబుతూ ఏడ్చేశాడు. జాఫ‌ర్ మిస్ యూ.. మ‌హేష్ తో నేను అన్ని షేర్ చేసుకుంటాను అని బాబా అన‌డంతో మీరు ఎవ‌రి స‌ల‌హాలు వినొద్దు. మీరు మీరుగా ఉండండి. మ‌హేష్ వెళితే మీరు ఎవ‌రితో ఉంటారు ? అని శ్రీముఖి అన‌డంతో నేను నేనుగా ఉంటాను. అంద‌రితో స‌ర‌దాగా ఉంటాను అని చెబుతూ కాస్త భావోద్వేగానికి గుర‌య్యారు బాబా. ఇక ఈ రోజు పంతం నీదా నాదా అనే కెప్టెన్ టాస్క్ ఉండనుంది.

Related posts