telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” మూవీ సంబరాలు..

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా సినిమా “ఆర్ఆర్ఆర్”. తాజాగా ఈ సినిమా షూటింగ్ నిన్నపూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే.

RRR's Ukraine schedule wrapped, team returns to Hyderabad |  TeluguBulletin.com

దీంతో నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్ లో కన్పించిన పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. అదే రోజు సాయంత్రం దర్శకుడు రాజమౌళితో పాటు “ఆర్ఆర్ఆర్” టీం అంతా కలిసి షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Multiple pan-India projects | RRR: Jr NTR wraps up his Ukraine schedule and  arrives back in Hyderabad; fans go crazy after catching the glimpse of the  massy star Photogallery at BollywoodLife.com

రాజమౌళి కేక్ కటింగ్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ టీం అంతా హైదరాబాద్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు ఈ ప్రెస్ మీట్ లో తెరపడనుంది.ఇక డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RRR Movie (Oct 2021) - Trailer, Star Cast, Release Date | Paytm.com

ఆర్ఆర్ఆర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నారు.అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

RRR | Full Movie HD Facts 4K | NTR | Ram Charan | Ajay D | Alia Bhatt |  Olivia Morris | SS Rajamouli - YouTube

ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న భారీ సంఖ్యలో థియేటర్లతో అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Related posts