telugu navyamedia
సినిమా వార్తలు

సుప్రియతో అడవిశేష్ పెళ్ళి… స్పందించిన హీరో

adivi-sesh

“గూఢచారి” సినిమాతో భారీ హిట్ అందుకుని, ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు అడవిశేష్. ఇప్పుడు “గూఢచారి-2” చిత్రాన్ని కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే నిన్న అడవిశేష్ త్వరలోనే ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని ప్రకటించారు. అది చూసిన నెటిజన్లు కొందరు ఆ వార్త “గూఢచారి-2” గురించే అనుకోగా… మరికొందరు మాత్రం ఆయన పెళ్ళి వార్త అని అనుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఏకంగా అడవి శేష్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియని పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ పెళ్ళిని అక్కినేని వారి కోడలు సమంత సెట్ చేస్తోందని, డెస్టినేషన్ మ్యారేజ్ కు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై అడవి శేష్ స్పందించారు. ఇదొక నిరాధారమైన వార్త అంటూ కొట్టిపారేసారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎవరో వెబ్ లో క్రియేట్ చేసిన గాలివార్త అని, కానీ దురదృష్టవశాత్తు బాగా స్ప్రెడ్ అయ్యింది అని అన్నారు. అంతేకాదు తను అతి త్వరలోనే చేయబోయే ఆ అనౌన్స్మెంట్ దేని గురించి అనేది తరువాత చెప్తానని, ప్రస్తుతానికి తను దాని గురించి మాట్లాడకూడదని అన్నారు.

Related posts