telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్యాష్ ముట్టుకుంటే కరోనా…!?

Hyderabad Police Seize Three Crores

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 170కి చేరింది. తెలంగాణలో బుధవారం ఒక్క రోజే ఎనిమిదికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. వీరిలో ఏడుగురు విదేశీయులు కాగా, ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తి. స్కాట్లాండ్ నుంచి వచ్చి మేడ్చల్ యువకుడితోపాటు ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఈ నేపథ్యంలో… బ్యాంకుల వినియోగదారులు నేరుగా నగదు బదులు యూపీఐ, నెఫ్ట్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకునేలా చూడాలని ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను కోరింది. కరోనా వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. కరెన్సీ ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చునని ఊహాగానాలు వినవస్తున్న వేళ ఈ ప్రపోజల్ తెచ్చినట్టు ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మీడియా, సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్ ఎమ్మెస్ ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేపట్టేలా కస్టమర్లను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆయా బ్యాంకుల బ్రాంచిలు, ఔట్ లెట్ల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా వారిని ఎడ్యుకేట్ చేయాలని కూడా ఈ శాఖ సలహా ఇచ్చింది.

Related posts