telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుధీర్ నా బ్రదర్… యాంకర్ వర్షిణి కామెంట్స్

varshini

ఇప్పుడు బుల్లితెరపై అనసూయ, రష్మి, వర్షిణి, విష్ణు ప్రియ, శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఇక మేల్ యాంకర్స్‌లలో సుడిగాలి సుధీర్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే రష్మి-సుధీర్‌ల ఎఫైర్ వచ్చినన్ని వార్తలు మరే టీవీ సెలబ్రిటీలపై లేవు. ఇక మనోడు విష్ణు ప్రియ, వర్షిణిలతో సైతం సీన్‌లను, పాటలను బాగా రక్తి కట్టిస్తుంటాడు. ఈ మధ్య సుధీర్‌-వర్షిణి మధ్య ఎఫైర్ అంటూ వార్తలు గట్టిగా వస్తుండటంతో వీటిపై స్పందించారు వర్షిణి. ముందుగా రష్మి-సుధీర్‌ల మధ్య కెమెస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్‌లో రష్మి-సుధీర్ పెయిర్ చాలా బాగుంటుంది. నేను, విష్ణ ప్రియ అతనితో కలిసి చేసినా.. రష్మి-సుధీర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. రష్మి ఎప్పుడూ సుధీర్‌ని తిడుతూ ఉంటుంది… సుధీర్ అలా కాదమ్మా.. ఇలా కాదమ్మా అని చెప్తూ ఉంటాడు. వాళ్ల ఇద్దరూ డాన్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఇక వర్షిణి సుధీర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని చాలా మంది అడుగుతుంటారు.. అయితే నిజానికి నేను సుధీర్‌ని బ్రో (బ్రదర్) అని పిలుస్తాను. అతను కూడా నన్ను చెల్లెలు లాగే చూస్తాడు తిరిగి నన్ను బ్రో అని పిలుస్తాడు. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే. తను నా ఫ్యామిలీ సభ్యుడుగానే అనిపిస్తుంది. చాలా కేరింగ్‌గా చూస్తాడు. దయచేసి మా రిలేషన్ గురించి తప్పుగా అనుకోవద్దు. ఆన్ స్క్రీన్‌లో మేం అలా కనిపిస్తాం కాని.. ఆఫ్ స్క్రీన్‌లో మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్.

Related posts