టాలీవుడ్ నటులు నందు, రష్మీ గౌతమ్ జంటగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. తాజాగా పోతురాజు గాడి లవర్ వాణి అంటూ రష్మీ గౌతమ్ లుక్ ను ఆ సినీ యూనిట్ విడుదల చేసింది. తలపై కిరీటం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్న రష్మీ లుక్ అభిమానులను ఆకర్షిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీన్ పగడాల- బోసుబాబు- ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. నిన్న నందు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఆయననకు శుభాకాంక్షలు తెలిపారు చిత్రయూనిట్. అందులో జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపించాడు. ఇక ఈ సినిమాలో పోతురాజుగా కనిపించనున్నాడు నందు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను రివీల్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీ గౌతమ్ నటిస్తుంది. రష్మీ జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. పోతురాజు గాడి లవర్ వాణీ అంటూ రష్మీని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది.
#Vaani pic.twitter.com/H6VqYQhKmP
— rashmi gautam (@rashmigautam27) September 9, 2020
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్