telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్‌ కీలక నిర్ణయం…మెచ్చుకున్న చిరంజీవి

ఏపీ సీఎం జగన్‌పై మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్‌లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినందుకు ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… ఓ గొప్ప దేశభక్తుడని చిరు చెప్పారు. అలాంటి సమర యోధుడి పేరు కర్నూలు విమానాశ్రయానికి పెట్టడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఆయన పేరును సీఎం జగన్‌… కర్నూలు ఎయిర్‌పోర్టుకు పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు చిరు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కాగా…ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ ఇవాళ ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పి. హర్‌దీప్‌ సింగ్‌ కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు.

Related posts