telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : …అశ్వత్థామరెడ్డి హౌస్ అరెస్ట్ .. ఇంటినుండి దీక్షలో …

aswadhamareddy house arrest and

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు ‘బస్ రోకో’కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో దీక్ష చేపట్టాలంటూ నేతలు పిలుపునిచ్చారు.

జేఏసీ పిలుపు నేపథ్యంలో యూనియన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు, జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. కార్మికుల రాకతో ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

Related posts