telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

చెట్టును నరికినందుకు రూ.10వేలు ఫైన్…

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెట్లను నరికినవారికి.. అంతేకాదు.. చెట్లను మేకలు, గొర్రెలు మేసినా ఫైన్లు వేసిన ఘటనలు మన చూసాము.. తాజాగా.. ఇంటి నిర్మాణం కోసం చెట్టు నరికిన ఓ వ్యక్తికి రూ.10 వేలు జరిమానా విధించారు అధికారులు.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నపూర్‌లోని అల్కా పూర్ కాలనీ రోడ్డు నంబర్ 8లో ఉంటున్న ఇనాథుల్ల ఖాన్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణంలో భాగంగా 15 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్టును నరికి వేశాడు… అయితే, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.. దీంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులు.. చెట్టు నరికివేసిన వ్యక్తికి 10 వేల రూపాయల జరిమానా విధించారు.. ఇక నుంచి మణికొండ మున్సిపాలిటీలో చెట్లను నరకాలంటే మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయాలని.. అలా చేస్తే.. ఆ చెట్లను ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో చెట్టును సజీవంగా వేరే చోటకు తరలిస్తామని.. ఇది కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుందని.. అయితే, ఆ ఖర్చు కూడా యజమాని భరించాలని.. కాదని ఎవరైనా నరికితే.. రూ. 10 000 అపరాధ రుసుం కింద జరిమానా వేస్తామని స్పష్టం చేశారు మణికొండ మున్సిపాలిటీ మేనేజర్ పవన్ కుమార్. మరి మీరు కూడా జాగ్రత్త.. చెట్లు నాటండి.. నరకకండి.

Related posts