telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మొదట మూడు కోట్ల మందికి వ్యాక్సిన్…

corona vaccine covid-19

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతున్నది.  ఇప్పటికే ఎక్స్ పర్ట్ కమిటీ ఆక్స్ ఫర్డ్ టీకాను అత్యవసర వినియోగం కింద అనుమతించాలని డిసీజీఐకి సూచించింది. మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, కోవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటి ఎవరికీ అందిస్తారు అనే దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది.  మొదటగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందిస్తారు.  దేశంలో వైద్యులు కోటి మంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు రెండు కోట్ల మందికి ఉచితంగా టీకాను అందిస్తారు.  ఆ తరువాత జూన్ వరకు 50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి టీకాను అందిస్తారు.  దేశంలోని మిగతా వారికి అవసరానికి అనుగుణంగా టీకాను అందించే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  ఇక ఇప్పటికే కేరళ, బీహార్ రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తామని హామీ ఇచ్చాయి.  అలానే ఢిల్లీ కూడా రాష్ట్రంలోని ప్రజలకు ఉచితంగా టీకా అందించేందుకు ముందుకు వచ్చింది.  చూడాలి మరి ఈ వ్యాక్సిన్ సరిగ్గా పని చేస్తుందా… లేదా అనేది.

Related posts