బీహార్ ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఆర్‌జేడీ, ఎన్‌డీఏ తదితర పార్టీల మధ్య పోటీ హారాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే బీహార్ తన మూడో విడత పోలింగ్ ఇటీవల 7వ తారీకున ముగించుకుంది. ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. అయితే ఈ లెక్కింపుల కోసం మొత్తం 55 లెక్కింపు కేంద్రాలను 38 జిల్లాలలో ఎన్నికల కమిషన్ ఏర్పారు చేసింది. ఈ ఎన్నికలు 3,755 మంది అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. దానికి తోడుగా ఈ ఎన్నికల ఫలితాలను ప్రతి ఒక్కరు ఓటర్ హెల్ప్‌లైన్ అనే అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఆర్జేడీ కూటమి జేడీయూ కూటమిపై ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు 125 మహాఘట్‌బందన్ ఆధిక్యంలో ఉంది. అటు ఎన్‌డీఏ కూటమి 110 సీట్లల్లో ఆధిక్యలోకి వచ్చింది. తుది ఫలితం వచ్చేవరకు ఎవరు గెలిచేది క్లారిటీ వస్తుంది. కాగా..ఎగ్జిట్ ఫలితాల ప్రకారం ఈ సారి ఎన్నికల్లో మహాఘట్‌బందన్ 116-138 సీట్లను గెలుస్తుందని, ఎన్‌డీఏ కేవలం 61-91 సీట్లను, ఎల్‌జేపీ 2-3 సీట్లను సొంతం చేసుకుంటాయని తేలాయి.
previous post
next post
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని