telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికలు ముగిశాయి.. పెట్రో బాదుడు మొదలు…

petrol prices raising day by day

పెట్రోల్‌ ధరలకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయంలో లేని రెక్కలు వచ్చాయి. తుది విడత పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచే చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును ప్రారంభించాయి. గత తొమ్మిది రోజుల్లో వీటి ధరలు 78 నుంచి 80 పైసలు పెరిగాయి.

చివరి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌(మే 19) వరకూ చమురు సంస్థలు వీటి ధరలను పెంచలేదు. అయితే పోలింగ్‌ ముగియగానే మే 20 నుంచి ధరల పెంపు కొనసాగింది. గత 9 రోజుల్లో పెట్రోల్‌ ధర 83 పైసలు పెరగ్గా.. డీజిల్‌ ధర 73 పైసలు పెరిగింది. మంగళవారం పెట్రోల్‌ ధర 11 పైసలు, డీజిల్‌ ధరలో 5 పైసల పెంపు నమోదైంది. ఎన్నికల సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల చోటుచేసుకున్నప్పటికీ.. ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలు ధరలను పెంచలేదు. గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా కూడా చమురు సంస్థలు 19 రోజుల పాటు చమురు ధరలను పెంచని విషయం తెలిసిందే.

Related posts