telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్ష్మీదేవికి భక్తురాలిగా మారిపోయిన హాలీవుడ్ బ్యూటీ

Salma

ఓ హాలీవుడ్ నటి హిందూ దైవం లక్ష్మీదేవికి భక్తురాలిగా మారిపోయారు. ఈ విషయాన్ని సల్మా హయేక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నేను నా అంతర్ సౌందర్యంతో కనెక్ట్ కావాలని కోరుకున్నప్పుడు నా మనసులో లక్ష్మీదేవిని ఊహించుకొని ధ్యానం ప్రారంభిస్తాను. లక్ష్మీదేవి తన భక్తులకు సిరిసంపదలు, అదృష్టం, ప్రేమ, అందం, మాయ, ఆనందం, శ్రేయస్సును అందిస్తుందని హిందుయిజం చెబుతోంది. ఏదేమైనా, ఆమె రూపం నన్ను ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తుంది. మీ అంతర్గత సౌందర్యానికి ఆనందం అనేది ద్వారం వంటిది” అని సల్మా హయేక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు “నాకు ఒక దేవుడు మాత్రమే ఉన్నాడు. కానీ, మంచి ఉద్దేశంతో చెప్పే ప్రతిదాన్ని నేను నమ్ముతాను. ఆ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు లక్షకు పైగా లైకులు వచ్చాయి. సల్మా పోస్ట్ చూసి సోషల్ మీడియాలో ఉన్న భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా హాలీవుడ్ నటీనటులు హిందూ దేవతలను పూజించడం కొత్తేమీ కాదు. నటుడు విల్ స్మిత్, జూలియా రాబర్ట్స్, మిలే సైరస్ కూడా గతంలో హిందూ దేవతలను పూజించారు.

 

View this post on Instagram

 

When I want to connect with my inner beauty, I start my meditation focusing on the goddess Lakshmi, who in Hinduism represents wealth, fortune, love, beauty, Māyā (literally meaning “illusion” or “magic”), joy and prosperity. Somehow her image makes me feel joyful, and joy is the greatest door for your inner beauty. Cuando quiero conectarme con mi belleza interior, comienzo mi meditación enfocándome en la diosa Lakshmi, quien en el hinduismo representa la riqueza, la fortuna, el amor, la belleza, Māyā (que literalmente significa “ilusión” o “magia”), alegría y prosperidad. De alguna manera su imagen me trae alegria, y piensa que la alegría es la puerta más directa para tu belleza interior. #innerbeauty #hinduism #lakshmi #meditation

A post shared by Salma Hayek Pinault (@salmahayek) on

Related posts