telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ కమెడియన్ అసభ్యంగా ప్రవర్తించాడు… ప్రగతి షాకింగ్ కామెంట్స్

Pragathi

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సృష్టించిన ప్ర‌కంప‌న‌లు అన్నీ ఇన్ని కావు. ఎంతోమంది నటీమణులు మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు. తాజాగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి సంచలన వ్యాఖ్య‌లు చేసింది తెలుగు నటి ప్రగతి. వందలాది తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ల‌కు మ‌ద‌ర్ గా, సిస్ట‌ర్ గా, వ‌దిన‌గా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఓ సీనియర్ కమెడియన్ తనతో అస‌భ్యంగా ప్రవర్తించడాని చెప్పి షాక్ కి గురి చేసింది ప్రగతి. షూటింగ్ జరుగుతుండగానే కావాలనే ఇబ్బంది పెడుతూ ఎక్స్‌ట్రాలు చేసేవాడని, పదేపదే తనను తాకాలని ప్రయత్నించే వాడని, దీంతో ఓ రోజు క్యారవాన్‌కి తీసుకెళ్లి ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని వార్నింగ్ ఇవ్వడంతో అతను సైలెంట్‌గా అయ్యాడ‌ని, కానీ ఆ తరువాత ఆ స్టార్ కమెడియన్ తన గురించి బ్యాడ్ గా ప్రచారం చేశాడని చెప్పుకొచ్చింది ప్రగతి. అయితే ఆ కమెడియన్ పేరు వెల్లడించకపోవడంతో అతను ఎవరనే విషయంపై హాట్ చర్చ నడుస్తోంది తెలుగు ఇండస్ట్రీలో.

Related posts